YSRCP: జ‌గ‌న్ నోరు తీపి చేసిన పేర్ని నాని... ప‌క్క‌నే కొడాలి నాని.. ఫొటో ఇదిగో

  • జ‌గన్ కేబినెట్‌లో మంత్రులుగా ప‌నిచేసిన పేర్ని, కొడాలి
  • మాజీల‌య్యాక జ‌గ‌న్‌తో క‌లిసి క‌నిపించ‌ని వైనం
  • పెడ‌న స‌భా వేదిక‌పై జ‌గ‌న్‌కు స్వీటు తినిపించిన పేర్ని
  • ఫొటోను విడుద‌ల చేసిన ముఖ్యమంత్రి కార్యాల‌యం
ex ministers perni nani and kodali nani spotted with cm ys jagan on pedana dais

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో... ఆ పార్టీకి చెందిన కృష్ణా జిల్లా కీల‌క నేత‌లు, మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని క‌లిసి క‌నిపించి చాలా కాల‌మే అయ్యింది. కేబినెట్ మినిస్ట‌ర్లుగా ఉన్న స‌మ‌యంలో జ‌గ‌న్‌తో క‌లిసి చాలా స‌న్నిహితంగా క‌లిసి క‌నిపించిన ఈ ఇద్ద‌రు నేత‌లు... మాజీ మంత్రుల‌య్యాక జ‌గ‌న్‌తో క‌లిసి క‌నిపించిన దాఖలాలే లేవు. 

ఈ క్ర‌మంలో గురువారం జ‌గ‌న్‌తో పేర్ని, కొడాలి క‌లిసి క‌నిపించారు. నేత‌న్న‌నేస్తం నిధుల విడుద‌ల కోసం కృష్ణా జిల్లా పెడ‌న‌లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మానికి వెళ్లిన జ‌గ‌న్‌ను వేదిక మీదే పేర్ని, కొడాలి క‌లిశారు. ఈ సంద‌ర్భంగా కాస్తంత చొర‌వ చూపిన పేర్ని నాని... జ‌గ‌న్‌కు స్వీటు తినిపించారు. ఈ స‌మ‌యంలో కొడాలి నాని కూడా పేర్ని నాని వెనుకే నిల‌బ‌డి ఉన్నారు. ఈ ఫొటోను పెడ‌న కార్య‌క్ర‌మానికి చెందిన ఫొటోల‌లో ఒక‌టిగా సీఎంఓ విడుద‌ల చేసింది.

More Telugu News