వైద్య పరీక్షల కోసం విదేశాలకు సోనియాగాంధీ.. తోడుగా రాహుల్, ప్రియాంక!
- సోనియా విదేశాలకు వెళ్తున్నట్టు ప్రకటించిన జైరాం రమేశ్
- అయితే ఎప్పుడు వెళ్తున్నారనే విషయంపై క్లారిటీ ఇవ్వని వైనం
- అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని కూడా పరామర్శించనున్న సోనియా
- సెప్టెంబర్ 4న ఢిల్లీలో ఓ ర్యాలీలో ప్రసంగించనున్న రాహుల్
మరోవైపు, సెప్టెంబర్ 7న కన్నియాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాంగ్రెస్ చేపట్టే 'భారత్ జోడో యాత్ర' ప్రారంభం కానుంది. అంతేకాదు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగబోతోంది. ఈ ఎన్నికకు సంబంధించి ఈ వారంలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ పరిణామాలన్నీ చోటు చేసుకోబోతున్న తరుణంలో సోనియా మెడికల్ చెకప్ కోసం విదేశాలకు వెళ్తున్నారు. మరోవైపు, సోనియా చెకప్ కోసం ఏ దేశానికి వెళ్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారనే విషయాలపై మాత్రం కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇవ్వలేదు.