అందుకే మా జోడీ సూపర్ హిట్టయింది: చిరంజీవి పుట్టినరోజున రాధ స్పందన
- నేడు మెగాస్టార్ బర్త్ డే
- చిరంజీవిపై పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ
- తమ కెమిస్ట్రీ అద్భుతమన్న రాధ
- గొప్ప నటుడు కంటే చిరంజీవి అమోఘమైన డ్యాన్సర్ అని కితాబు
"సినిమా ఇండస్ట్రీలో ఓ జోడీ సూపర్ హిట్టయింది అంటే... ఓ నటుడి గురించి ఆలోచిస్తే, అతడికి జోడీ అయిన ఆ నటీమణి కూడా గుర్తుకురావాలి. అలాగే ఆ నటీమణి గురించి ఆలోచిస్తే అతడికి సరిజోడీ అయిన ఆ నటుడు కూడా గుర్తుకు రావాలి. అలాంటి జోడీయే మాది. ఇప్పటికీ నన్ను అచ్చెరువొందించే అంశం ఒకటుంది. అభిమానులు నన్ను ఎప్పుడు కలిసినా... చిరంజీవి-రాధ పాటలు సూపర్బ్ అంటారు.
మా మధ్య అమోఘమైన కెమిస్ట్రీ ఉండేది. అంతకుమించిన అవగాహన ఉండేది. మా జోడీ ఎంతో ప్రజాదరణ పొందడానికి కారణం ఇదే. గొప్ప నటుడు కంటే కూడా చిరంజీవి అద్వితీయమైన డ్యాన్సర్. అంతకుమించి అసమాన వ్యక్తిత్వం ఆయన సొంతం. ప్రియమైన చిరంజీవి గారు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. దేవుడు మీకు ఆయురారోగ్యాలు, సుఖశాంతులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అంతేకాదు, మీ తదుపరి చిత్రాలు బ్లాక్ బస్టర్ కావాలని ఆకాంక్షిస్తున్నాను" అంటూ రాధ ట్వీట్ చేసింది.