మెగా ఫ్యాన్స్ కు పండగ... 'గాడ్ ఫాదర్' టీజర్ విడుదల
- మలయాళ హిట్ చిత్రం 'లూసిఫర్' రీమేక్ 'గాడ్ ఫాదర్'
- ప్రధాన పాత్రలు పోషించిన నయనతార, సత్యదేవ్, సముద్రఖని
- కీలక పాత్ర పోషించిన సల్మాన్ ఖాన్
ఈ చిత్రంలో చిరంజీవి రాజకీయ నాయకుడిగా కనిపించనున్నారు. మలయాళంలో ఘన విజయం సాధించిన 'లూసిఫర్' చిత్రానికి రీమేక్ గా ఈ సినిమాను నిర్మించారు. ట్రైలర్ చివర్లో సల్మాన్ ఖాన్ ను ఉద్దేశిస్తూ 'వెయిట్ ఫర్ మై కమాండ్ బ్రదర్' అంటూ చిరంజీవి చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించారు. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి.