హిట్ కోసమే యంగ్ హీరో వెయిటింగ్!
- ఎలాంటి నేపథ్యం లేకుండా వచ్చిన కిరణ్ అబ్బవరం
- హీరోగా వరుసగా దక్కుతున్న అవకాశాలు
- తాజా చిత్రంగా రూపొందిన 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని'
- సెప్టెంబర్ 9వ తేదీన సినిమా విడుదల
అలా ఆయన చేస్తున్న సినిమాలలో ముందుగా ప్రేక్షకులను పలకరించడానికి 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' రెడీ అవుతోంది. కోడి రామకృష్ణ కూతురు కోడి దివ్య నిర్మాతగా మారిపోయి, ఈ సినిమాను నిర్మిస్తోంది. కిరణ్ అబ్బవరం జోడీగా సంజనా ఆనంద్ తెలుగు తెరకి పరిచయమవుతోంది. సెప్టెంబర్ 9వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.
ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని సమకూర్చాడు. రీసెంట్ గా వదిలిన 'నచ్చావ్ అబ్బాయి' అనే పాటకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకి ముందు కిరణ్ నుంచి వచ్చిన రెండు సినిమాలు పరాజయం పాలయ్యాయి. అందువలన ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన ఉన్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందేమో చూడాలి.