YSRCP: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్ వీడియోపై సినీ న‌టుడు పృథ్వీరాజ్‌ స్పంద‌న ఇదే!

Prudhvi Raj responds on ysrcp mp gorantla madhav video
షార్ట్స్‌లో చూడండి
మ‌హిళ‌తో న‌గ్నంగా వీడియో కాల్ మాట్లాడిన‌ట్లుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌లు, సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టిన వీడియోపై వైసీపీ మాజీ నేత‌, ప్ర‌ముఖ సినీ న‌టుడు పృథ్వీరాజ్ గురువారం స్పందించారు. అంగ‌బ‌లంతో పాటు అర్థ‌బ‌లం కూడా ఉండ‌టంతోనే గోరంట్ల‌ను వైసీపీ నేత‌లు వెన‌కేసుకుని వ‌స్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. ఈ వీడియోపై గోరంట్ల మాధ‌వ్ స్పందించిన తీరు కూడా వైసీపీ నేత‌ల‌కు న‌చ్చిన‌ట్టుగా ఉంద‌ని కూడా పృథ్వీ వ్యాఖ్యానించారు.

ఇంత‌టి దౌర్భాగ్యం ఇంత‌కు ముందెన్న‌డూ చూడ‌లేద‌ని పృథ్వీరాజ్ అన్నారు. పార్ల‌మెంటులో తెలుగు ఎంపీల‌కు ఓ మంచి చ‌రిత్ర ఉంద‌న్న పృథ్వీ... అదంతా గోరంట్ల వీడియో కార‌ణంగా మొత్తం తుడిచిపెట్టుకుపోయింద‌న్నారు. గోరంట్ల వ్య‌వహారంలో వారం పాటు మీడియా స‌మావేశాలు పెట్టిన నేత‌లు ఇప్పుడు ఏమ‌య్యార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. 

అనంత‌పురం ఎస్పీ చెబుతున్న విష‌యాలు ఒక‌దానితో మ‌రొక‌టి పొంత‌న లేకుండా ఉన్నాయ‌న్న పృథ్వీ... చివ‌ర‌కు ఆ వీడియో ఫేక్ అని తేల్చార‌ని మండిప‌డ్డారు. ఎవ‌రెన్ని చెప్పినా ప్ర‌జ‌లు ఆ మాత్రం అవ‌గాహ‌న చేసుకోకుండా ఉండ‌లేరా? అని పృథ్వీ వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
YSRCP
Gorantla Madhav
Prudhvi Raj
Tollywood

More Telugu News