దిష్టిబొమ్మను కాదు.. దేశాన్ని కాల్చండి: టీడీపీ నేతలపై కుప్పం అర్బన్ సీఐ శ్రీధర్ మండిపాటు
- గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కుప్పంలో టీడీపీ ఆందోళన
- దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా అడ్డుకున్న సీఐ
- చంద్రబాబు పీఏ.. సీఐ శ్రీధర్‌కు మధ్య వాగ్వివాదం
- చంద్రబాబు పీఏ మనోహర్ సహా 15 మందిపై కేసులు
దీనికి సీఐ బదులిస్తూ.. ఎంపీ నా స్నేహితుడు కాదని, విధుల్లో భాగంగానే అడ్డుకుంటున్నట్టు చెప్పారు. ఇలా చేసేవారు చాలామందే ఉంటారని, మీరు చేయలేదా? అని ప్రశ్నించారు. ఎంపీ తప్పు చేశారని తేలితే చట్టబద్ధంగా శిక్ష నుంచి తప్పించుకోలేరని అన్నారు. ‘‘తప్పు చేస్తే దిష్టిబొమ్మను కాలుస్తారా?.. అయినా, దిష్టిబొమ్మనెందుకు దేశాన్ని కాల్చండి’’ అని మనోహర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మనోహర్ సహా 15 మంది టీడీపీ నేతలపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.