ధరల పెరుగుదలపై కాంగ్రెస్ నిరసన ప్రదర్శన.. రాహుల్ గాంధీ, ప్రియాంక నిర్బంధం
- ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ వైపు వెళ్లే ప్రయత్నం
- అడ్డుకున్న పోలీసులు.. బ్యారికేడ్లతో బ్లాక్
- నలుగురు వ్యక్తుల నియంతృత్వంలో దేశం ఉందంటూ రాహుల్ విమర్శ
కాంగ్రెస్ ఎంపీల నిరసన ప్రదర్శనను నిలువరించడానికి మహిళా పోలీసులను సైతం రంగంలోకి దించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందన్నారు. మన దేశం ఇప్పుడు నలుగురు వ్యక్తుల నియంతృత్వంలో ఉందని విమర్శలు చేశారు. నల్ల చొక్కాలు ధరించి మరీ కాంగ్రెస్ ఎంపీలు నిరసన ప్రదర్శనకు దిగడం గమనార్హం. రాహుల్ ను అదుపులోకి తీసుకుని వ్యాన్ ఎక్కిస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది.