నేషనల్ హెరాల్డ్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు
- ఢిల్లీలోని 12 కార్యాలయాల్లో ఈడీ సోదాలు
- కోల్ కతా కేంద్రంగా 2 చోట్ల ఈడీ దాడులు
- ఇప్పటికే ముగిసిన రాహుల్, సోనియాల ఈడీ విచారణ
ఈ కేసులో ఇటీవలే తొలుత రాహుల్ గాంధీ, ఆ తర్వాత సోనియా గాంధీ ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీని 5 రోజుల పాటు విచారించిన ఈడీ అధికారులు సోనియాను 3 రోజుల పాటు విచారించారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించే దిశగా ఓ పత్రికను నడపాలన్న ఉద్దేశంతో గతంలో భారత మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ హెరాల్డ్ పత్రికను స్థాపించారు. ఈ పత్రిక నిర్వహణ కోసం యంగ్ ఇండియా పేరిట ఓ సంస్థను కూడా ఆయన ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు చెందిన ఆస్తులను రాహుల్ గాంధీ నిబంధనలకు విరుద్ధంగా దారి మళ్లించారన్న ఆరోపణలపై ఈడీ విచారణ సాగిస్తున్న సంగతి తెలిసిందే.