సీనియర్ కమెడియన్ సారథి కన్నుమూత
- కొంత కాలంగా కిడ్నీ, లంగ్స్ సమస్యలతో బాధపడుతున్న సారథి
- ఆయన వయసు 83 సంవత్సరాలు
- 350కి పైగా సినిమాల్లో నటించడమే కాక.. పలు చిత్రాలను నిర్మించిన సారథి
కేజే సారథి 1942 జూన్ 26న పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుగొండలో జన్మించారు. ఆయన పూర్తి పేరు కడలి విజయ సారథి. ఆయన 350కి పైగా చిత్రాలలో నటించారు. అంతేకాదు నిర్మాతగా మారి కృష్ణంరాజుతో 'ధర్మాత్ముడు', 'విధాత', 'శ్రీరామచంద్రుడు', 'అగ్గిరాజు' చిత్రాలను నిర్మించారు. కేజే సారథి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.