కామన్వెల్త్ గేమ్స్: టీమిండియాకు 100 పరుగుల టార్గెట్ నిర్దేశించిన పాక్ అమ్మాయిలు
- బర్మింగ్ హామ్ లో మ్యాచ్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్
- 18 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌట్
- 32 పరుగులు చేసిన మునీబా అలీ
- చెరో రెండు వికెట్లు తీసిన స్నేహ్ రాణా, రాధా యాదవ్
అనంతరం, 100 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్ ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించింది. 4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 41 పరుగులు చేసింది. ఎడమచేతివాటం ఓపెనర్ స్మృతి మంధన 17 బంతుల్లో 28 పరుగులు చేయగా, షెఫాలీ వర్మ 7 బంతుల్లో 12 పరుగులు చేసింది. టీమిండియా గెలవాలంటే ఇంకా 84 బంతుల్లో 59 పరుగులు చేయాలి. కాగా, మ్యాచ్ కు ముందు వర్షం పడడంతో ఓవర్లను 18కి కుదించడం తెలిసిందే.