అదంతా 'విరాటపర్వం' మహిమేనట!

Venu Udugula Special
  • ఇటీవలే థియేటర్లకు వచ్చిన 'విరాట పర్వం'
  • ఓటీటీ వైపు నుంచి మంచి రెస్పాన్స్ 
  • వేణు ఉడుగుల కథలకు మంచి రెస్పాన్స్ 
  • త్వరలోనే నెక్స్ట్ ప్రాజెక్టు గురించిన ప్రకటన
ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి కంటెంట్ ఉన్న సినిమాల్లో 'విరాటపర్వం' ఒకటి. ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకూ మంచి ఫీల్ తో నడుస్తుంది. సహజత్వానికి దగ్గరగా వెళుతూ అలా కూర్చోబెట్టేస్తుంది. థియేటర్ల నుంచి ఆశించిన స్థాయి రెస్పాన్స్ రాకపోయినప్పటికీ, ఓటీటీ ట్రాక్ పై ఈ సినిమా దూసుకుపోతోంది.

సినిమా అంటే రెండు ఫైట్లు .. నాలుగు పాటలు అనే కాన్సెప్ట్ కి భిన్నంగా దర్శకుడు వేణు కథలు ఉంటున్నాయి. పాత్రల్లో జీవం .. కథనంలో ఆసక్తి .. సహజత్వానికి పెద్దపీట ఉండటంతో ఆయన కథలు వెంటనే కనెక్ట్ అవుతున్నాయి. 

ఈ తరహా కథలు వెబ్ సిరీస్ లలో మంచి ఆదరణ పొందుతున్నాయి. అందువలన ఆయన దగ్గర నుంచి కథలను తీసుకుని .. ఏవి సినిమాలకి పనికొస్తాయి? ఏవి వెబ్ సిరీస్ లు చేసుకోవచ్చు? అనేవి అల్లు అరవింద్ టీమ్ పరిశీలన చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఇక తన తరువాత సినిమా ఏమిటనేది వేణు ఉడుగుల త్వరలో ప్రకటించనున్నాడు.
Go Back to Shorts
Venu Udugula
Virataparvam Movie
Allu Aaravind

More Telugu News