‘17 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ' అంటున్న అనుష్క
- అనుష్క తొలి చిత్రం సూపర్ విడుదలై 17 ఏళ్లు
- ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసిన ఆమె నటిస్తున్న తాజా చిత్ర బృందం
- 17 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అని రాసిన కేక్ ను సోషల్ మీడియాలో షేర్ చేసిన అనుష్క
ఆ తర్వాత చిత్ర బృందం నుంచి ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో సినిమా ఆగిపోయిందన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే వీటికి నవీన్ పోలిశెట్టి పుల్ స్టాప్ పెట్టాడు. ప్రస్తుతం అనుష్క ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటోంది. అయితే, అనుష్క తొలి చిత్రం ‘సూపర్’ విడుదలై 17 ఏళ్లు పూర్తయిన సందర్భంగా షూటింగ్ లొకేషన్‌లో కేక్ కట్ చేసి వేడుక నిర్వహించింది చిత్ర బృందం.
‘17 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ’ అని రాసి ఉన్న కేక్ ఫొటోని అనుష్క ట్విట్టర్ లో షేర్ చేసింది. ఇదే ఫొటోను నవీన్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘ఈ పదిహేడేళ్లలో నేనే అనుష్కకి బెస్ట్ కో స్టార్ అంట. అద్భుతమైన తన ఇన్నేళ్ల ప్రయాణానికి ఆమెకు శుభాకాంక్షలు. మా సినిమా షూటింగ్ జరుగుతోంది’ అని పేర్కొన్నాడు.
దాంతో, అటు ఈ చిత్రం ఆగిపోలేదనే విషయంతో పాటు అనుష్క 17 ఏళ్ల ప్రయాణం గురించి తెలిసి ఆమె అభిమానులు ఖుషీ అవుతున్నారు. కాగా, అనుష్కకి ఇది నలభై ఎనిమిదో చిత్రం. మరోపక్క, తమిళ దర్శకుడు ఎ.ఎల్ విజయ్ దర్శకత్వంలో ఓ సినిమాకు కూడా అనుష్క ఓకే చెప్పింది.