ఏపీపీ కంపెనీ దివాలా తీసింది.... చంద్రబాబు వేసిన పునాది రాళ్లన్నిటికీ ఇదే గతి!: విజయసాయిరెడ్డి
- 2019లో ఏపీపీతో అప్పటి సర్కారు ఒప్పందం
- రూ.24 వేల కోట్లతో పేపర్ మిల్లు ఏర్పాటుకు నిర్ణయం
- ఆ కంపెనీ పీకల్లోతు కేసుల్లో ఇరుక్కుందన్న విజయసాయి
ఈ నేపథ్యంలో, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఏపీపీ కంపెనీ రూ.24 వేల కోట్లతో రామాయపట్నంలో పేపర్ మిల్లు పెడుతోందని చంద్రబాబు హడావుడిగా భూమి పూజ చేశారని ఎద్దేవా చేశారు. ఆ కంపెనీ ఇప్పుడు పీకల్లోతు కేసుల్లో ఇరుక్కుని దివాలా పిటిషన్లు వేసిందని వెల్లడించారు. పేపర్ మిల్లు పెట్టడంలేదని చేతులెత్తేసిందని తెలిపారు. చంద్రబాబు వేసిన పునాది రాళ్లన్నింటికీ ఇదే గతి అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.