సినిమా షూటింగులు నిలిపివేయాలన్న ఆలోచనలో టాలీవుడ్ నిర్మాతలు!
- తెలుగు చిత్రపరిశ్రమలో మరో సంక్షోభం!
- ఆగస్టు 1 నుంచి షూటింగులు నిలిచిపోయే అవకాశం
- నిర్మాణ వ్యయం పెరగడం, ఓటీటీల ప్రభావంపై నిర్మాతల ఆందోళన
థియేటర్లకు ప్రేక్షకులు పెద్దగా రాకపోవడం నిర్మాతలను కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో, సినిమా షూటింగులు నిలిపివేయడం తప్ప మరో మార్గం లేదని వారు భావిస్తున్నట్టు తెలుస్తోంది.