Pawan Kalyan: ఇవ్వడమే తెలిసిన నాకు ఇవాళ ఓట్లు అడగడం ఇబ్బందిగా ఉంటోంది: పవన్ కల్యాణ్

Pawan Kalyan comments in East Godavari district
షార్ట్స్‌లో చూడండి
తూర్పుగోదావరి జిల్లాలో జనసేన రైతు భరోసా కార్యక్రమానికి పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు ఇవ్వడమే తెలుసని, తన జీవితంలో ఏదీ అడగలేదని స్పష్టం చేశారు. అలాంటి తనకు ఇవాళ ఓట్లు అడగడం చాలా ఇబ్బందిగా ఉంటోందని పేర్కొన్నారు. 

తన చివరి శ్వాస వరకు జనసేన పార్టీని నడిపిస్తానని, ఎలాంటి పరిస్థితులు వచ్చినా పార్టీని విలీనం చేసే ప్రశ్నే లేదని పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. ప్రజలు తమను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జనసేన ప్రభుత్వ ఏర్పాటు ప్రజల చేతుల్లోనే ఉందని, ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న ఏపీని కాపాడే శక్తి జనసేనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Pawan Kalyan
Janasena
Andhra Pradesh

More Telugu News