స్పీడు పెంచిన యువ హీరో కిరణ్ అబ్బవరం.. ఒకే రోజు రెండు సినిమాల ప్రకటన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్పీడు పెంచిన యువ హీరో కిరణ్ అబ్బవరం.. ఒకే రోజు రెండు సినిమాల ప్రకటన

kiran abbavaram anounces two new movies
  • ‘మీటర్‘ చిత్రంలో మాస్ క్యారెక్టర్
  • ‘రూల్స్ రాజన్’ లో క్లాస్ గెటప్ లో అబ్బవరం
  • బన్నీ వాసు నిర్మిస్తున్న ‘వినరో భాగ్యము విష్ణుకథ’లోనూ హీరోగా కిరణ్
యువ హీరో కిరణ్ అబ్బవరం స్పీడు పెంచాడు. హీరోగా పరిచయమయ్యాక అతి తక్కువ కాలంలోనే అతను వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. శుక్రవారం తన పుట్టిన రోజు సందర్భంగా కిరణ్.. రెండు చిత్రాలను ప్రకటించాడు. అతను హీరోగా నటిస్తున్న రెండు చిత్రాల ఫస్ట్ లుక్ పోస్టర్లు ఈ రోజు విడుదలయ్యాయి. 

వీటిలో ఒకటైన ‘మీటర్‘ సినిమాలో కిరణ్ మాస్ లుక్ లో నటించబోతున్నాడు. ఈ చిత్రానికి రమేశ్ కాడూరి దర్శకత్వం వహిస్తున్నాడు. పక్కా కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ఫస్ట్ లుక్ చూస్తేనే తెలిసిపోతుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ను తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసిన కిరణ్.. ‘నేను ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న మాస్ బొమ్మ’ అని క్యాప్షన్ ఇచ్చాడు.  
 
మరోవైపు రతినం క్రష్ణ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు ‘రూల్స్ రాజన్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇందులో కిరణ్ సూటు బూటు వేసుకొని పూర్తి క్లాస్ లుక్ లో అలరిస్తున్నాడు. ఈ చిత్రంలో ‘డీజే టిల్లు‘ ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండింటితో పాటు ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రంలో కూడా అబ్బవరం నటిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ మూవీలో కశ్మీర పరదేశి హీరోయిన్. 

ప్రశాంత్‌ నీల్, కిషోర్ తిరుమల దగ్గర పని చేసిన మురళి కిషోర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రం టీజర్‌‌ను గురువారమే విడుదల చేశారు. ‘ఏడు వింతల గురించి మాకు పెద్దగా తెలియదన్నా. మా జీవితాలన్నీ ఏడు కొండల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మాది తిరుపతి. నా పేరు విష్ణు. కొద్దిరోజుల్లో మీరందరూ చూడబోయేదే నా కథ’ అంటూ తన క్యారెక్టర్ గురించి కిరణ్‌ టీజర్‌‌లో ఇంట్రడక్షన్‌ ఆకట్టుకుంది.. సెప్టెంబర్ 30న ఈ చిత్రం విడుదల కానుంది.
Tollywood
kiran abbavaram
new movie
neha shetty
allu aravind

More Telugu News