Singapore Open: సింగ‌పూర్ ఓపెన్‌లో సైనా నెహ్వాల్ శుభారంభం

Saina Nehwal wins first round in Singapore Open
షార్ట్స్‌లో చూడండి
తెలుగు నేల‌కు చెందిన భార‌త స్టార్ ష‌ట్ల‌ర్ సైనా నెహ్వాల్ సింగ‌పూర్ ఓపెన్‌ను బుధ‌వారం విజ‌యంతో మొద‌లుపెట్టింది. సింగ‌పూర్ వేదిక‌గా ప్రారంభ‌మైన సింగ‌పూర్ ఓపెన్ సూప‌ర్ 500 సిరీస్‌లో తొలి రౌండ్‌లో సైనా వ‌రుస సెట్ల‌తో మ్యాచ్‌ను నెగ్గి శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో భార‌త్‌కే చెందిన మాల్విక బ‌న్సోద్‌పై సైనా విజ‌యం సాధించింది. 21-18, 21-14 స్కోరుతో వ‌రుస సెట్ల‌ను కైవ‌సం చేసుకున్న సైనా విజ‌యం సాధించింది. 

ఈ టోర్న‌మెంట్‌లో భార‌త క్రీడాకారుల‌కు మిశ్ర‌మ ఫ‌లితాలు ద‌క్కాయి. కిడాంబి శ్రీకాంత్ ఓడిపోగా.. అత‌డిని మ‌ట్టి కరిపించి భార‌త ష‌ట్ల‌ర్ మిథున్ మంజునాథ్ రికార్డు విక్ట‌రీని న‌మోదు చేశాడు. పీవీ సింధు, ప్ర‌ణ‌య్‌లు కూడా తొలి రౌండ్‌ను నెగ్గారు. భార‌త్ త‌ర‌ఫున తొలి రౌండ్‌లో మెజారిటీ విక్ట‌రీలే న‌మోదు కాగా... కిడాంబి శ్రీకాంత్ మాత్రం ఓడిపోవ‌డం గ‌మ‌నార్హం.
Go Back to Shorts
Singapore Open
Saina Nehwal
Kidambi Srikanth
PV Sindhu
Prannoy

More Telugu News