ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకే మా మద్దతు: ఉద్ధవ్ థాకరే ప్రకటన
- పార్టీ ఎంపీలతో శివసేన అధినేత సమావేశం
- 19 మందిలో 12 మంది ముర్ముకే మద్దతు
- అధికారిక ప్రకటన చేసిన థాకరే
- విశాల దృక్పథంతో నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడి
అయితే, తమ నిర్ణయం వెనుక ఎవరి బలవంతం లేదని థాకరే స్పష్టం చేశారు. ఎంపీలతో సమావేశంలో తనపై ఎవరూ ఒత్తిడి తేలేదని అన్నారు. ఓ గిరిజన మహిళ రాష్ట్రపతి అయ్యేందుకు మొదటిసారిగా అవకాశం వచ్చిందని మా పార్టీలోని కొందరు గిరిజన నేతలు చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం అని వివరించారు.
"ప్రస్తుత రాజకీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే మేం ముర్ముకు మద్దతు ఇవ్వకూడదు... కానీ మా పార్టీ అల్ప బుద్ధి కలిగిన పార్టీ కాదు కాబట్టే విశాల దృక్పథంతో ఆమెకు మద్దతు ఇస్తున్నాం" అని థాకరే స్పష్టం చేశారు.