తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా రాజీవ్ సాగర్ నియామకం
- తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న రాజీవ్
- కేటీఆర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపిన వైనం
- కేసీఆర్, కవితలకు కృతజ్ఞతలు తెలిపిన రాజీవ్
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను సోమవారం కలిసిన రాజీవ్ సాగర్... ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. రాజీవ్ సాగర్ గత కొంతకాలంగా ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలోని తెలంగాణ జాగృతికి ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. తనపై నమ్మకం ఉంచి ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు, పార్టీలో తన ఎదుగుదలకు తోడ్పాటు అందించిన కవితకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.