ఇండియా వర్సెస్ ఇంగ్లండ్: మూడో రోజు ఆటలో విశేషాలు
- మ్యాచ్‌పై పట్టుబిగించిన భారత్
- మరోమారు విఫలమైన కోహ్లీ, విహారి, గిల్
- అర్ధ సెంచరీతో క్రీజులో ఉన్న పుజారా
- 257 పరుగుల ఆధిక్యంలో బుమ్రా సేన
మరోవైపు, తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన చటేశ్వర్ పుజారా ఈసారి మాత్రం నిలదొక్కుకుని అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని క్రీజులో ఉన్నాడు. హనుమ విహారి(11), కోహ్లీ (2) మరోమారు దారుణంగా నిరాశపరిచారు. అయితే, రిషభ్ పంత్ (30), పుజారా(50) క్రీజులో ఉండడంతో భారత్ భారీ స్కోరు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 84/5తో తొలి ఇన్నింగ్స్‌ను కొసాగించిన ఇంగ్లండ్ 284 పరుగులకు ఆలౌటైంది. కష్టాల్లో కూరుకుపోయిన జట్టును గట్టెక్కించే బాధ్యతను తన భుజాలపై వేసుకున్న బెయిర్‌స్టో శతకంతో ఆదుకున్నాడు. 119 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేసుకున్న బెయిర్‌స్టో భారత్‌పై టెస్టుల్లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. స్టోక్స్ (25), శామ్ బిల్లింగ్స్ (36) కలిసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పడంతో ఇంగ్లండ్ 284 పరుగులు సాధించగలిగింది. భారత బౌలర్లలో సిరాజ్ 4, బుమ్రా 3, షమీ 2 వికెట్లు పడగొట్టారు.