ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల
- ఆగస్టు 6న పోలింగ్, ఓట్ల లెక్కింపు
- జులై 5న విడుదల కానున్న నోటిఫికేషన్
- నామినేషన్ల దాఖలుకు జులై 19 వరకు గడువు
- జులై 22 వరకు నామినేషన్ల ఉపసంహరణ
జులై 20న నామినేషన్ల పరిశీలన జరగనుండగా... నామినేషన్ల ఉపసంహరణకు జులై 22 వరకు గడువు విధించారు. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్‌ను ఆగస్టు 6న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే అదే రోజుల ఓట్ల లెక్కింపును నిర్వహించనున్న కేంద్ర ఎన్నికల సంఘం విజేతను ప్రకటించనుంది. పార్లమెంటు ఉభయసభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటుంది.