రిలయన్స్ జియో బాధ్యతల నుంచి తప్పుకుంటున్న ముఖేశ్ అంబానీ... కొత్త చైర్మన్ గా ఆకాశ్ అంబానీ
- రిలయన్స్ సామ్రాజ్యంలో కీలక పరిణామం
- జియోలో యూనిట్ డైరెక్టర్ గా ఉన్న ముఖేశ్
- జూన్ 27న జియో బోర్డు సమావేశం
- కీలక తీర్మానాలకు ఆమోదం
- జియో కొత్త ఎండీగా పంకజ్ మోహన్ పవార్
ఇక, కంపెనీ మేనేజింగ్ డైరెక్టెర్ గా పంకజ్ మోహన్ పవార్ పగ్గాలు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు నిన్న నిర్వహించిన జియో బోర్డు డైరెక్టర్ల సమావేశంలో తీర్మానించారు. జియో కొత్త ఎండీగా పంకజ్ మోహన్ పవార్ ఐదేళ్ల పాటు కొనసాగుతారు. కేవీ చౌదరి, రమీందర్ సింగ్ గుజ్రాల్ జియో బోర్డులో స్వతంత్ర డైరెక్టర్లుగా కొనసాగుతారు.