చికెన్‌తో వంకాయ కర్రీ వడ్డింపు!.. సిద్దిపేట గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్!
- 107 మందికి తీవ్ర అస్వస్థత
- ఆసుపత్రికి తరలించిన అధికారులు
- ఘటనపై మంత్రి హరీశ్ రావు ఆరా
ఈ ఘటన వివరాల్లోకి వెళితే... ఈ పాఠశాలలో ఆదివారం రాత్రి చికెన్‌తో కలిపి వంకాయను వడ్డించారట. ఆ వెంటనే విద్యార్థులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఆ తర్వాత ఆదివారం రాత్రి నుంచి విద్యార్థులు కడుపు నొప్పితో బాధపడుతున్నారు. తీరా సోమవారం నాటికి వారికి కడుపు నొప్పి తీవ్రం కావడంతో వారంతా అధికారులకు తెలిపారు. దీంతో హుటాహుటీన అధికారులు విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు.