శివసేన రెబెల్స్ కు బంపరాఫర్ ప్రకటించిన బీజేపీ
- గువాహటిలో క్యాంపు వేసిన శివసేన రెబెల్స్
- వారున్న హోటల్ కు వెళ్లిన అసోం మంత్రి అశోక్ సింఘాల్
- 8 కేబినెట్ మంత్రులు, ఐదు సహాయక మంత్రి పదవులు ఆఫర్ చేసినట్టు సమాచారం
తాజాగా ఈ హోటల్ కు అసోం మంత్రి అశోక్ సింఘాల్ చేరుకుని, వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ సందర్భంగా వారి ముందు భారీ ఆఫర్ ఉంచినట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఎనిమిది కేబినెట్ మంత్రి పదవులు, ఐదు సహాయక మంత్రి పదవులు ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసింది. ఒకవేళ శివసేన ఎంపీలు వస్తే కేంద్రంలో రెండు మంత్రి పదవులు ఇస్తామని చెప్పినట్టు సమాచారం. మరోవైపు శివసేన కీలక నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ... రెబెల్స్ లోని 20 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని ప్రకటించడం గమనార్హం.