Kiran Abbavaram: 'సమ్మతమే' క్లైమాక్స్ కి మీరు కనెక్ట్ కాకుండా ఉండలేరు: కిరణ్ అబ్బవరం

  • యువ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం
  • తాజా చిత్రంగా రూపొందిన 'సమ్మతమే'
  • విభిన్నమైన ప్రేమకథా నేపథ్యంలో సాగే సినిమా 
  • ఈ నెల 24వ తేదీన విడుదల    
Sammathame movie update

యంగ్ హీరోలతో పోటీ పడటానికి కిరణ్ అబ్బవరం గట్టిగానే ట్రై చేస్తున్నాడు. ఈ మధ్య ఆయన నుంచి వచ్చిన 'సెబాస్టియన్' సినిమా ఆడియన్స్ ఆదరణ పొందలేకపోయింది. ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఆయన 'సమ్మతమే' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 

ప్రవీణ నిర్మించిన ఈ సినిమాకి, గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించాడు. శేఖర్ చంద్ర సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో,  కథానాయికగా చాందినీ చౌదరి అలరించనుంది. ఈ రొమాంటిక్ ఎంటర్టయినర్ ను ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో కిరణ్ అబ్బవరం బిజీగా ఉన్నాడు.

 తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. " ఇది ప్రేమకథనే .. ప్రేమికుల మధ్య బలమైన ఎమోషన్స్ ఉంటాయి. లవ్ లో పడిన తరువాత లవర్స్ తీరు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కానీ ఈ కథ ట్రీట్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది  .. ముఖ్యంగా క్లైమాక్స్ ను ఎవరూ గెస్ చేయలేరు. క్లైమాక్స్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News