అగ్నిపథ్ ను వెంటనే రద్దు చేసి గతంలో మాదిరే నియామకాలు చేపట్టాలి: షర్మిల
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అగ్నిపథ్ ను వెంటనే రద్దు చేసి గతంలో మాదిరే నియామకాలు చేపట్టాలి: షర్మిల

Sharmila demands cancellation of Agnipath
  • ఆగ్రహజ్వాలలు రాజేసిన అగ్నిపథ్
  • సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో విధ్వంసం
  • ఆందోళనకారులపై పోలీసుల కాల్పులు
  • బీజేపీకి బుర్రలేదన్న షర్మిల
  • దేశంలో అలజడులకు కారణమవుతోందని వ్యాఖ్యలు
సైనిక నియామకాల నూతన విధానం అగ్నిపథ్ తీవ్ర నిరసనలకు దారితీయడం పట్ల వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. బీజేపీ బుర్రలేని నిర్ణయాలు దేశంలో అలజడులకు కారణమవుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో దామెర రాకేశ్ బలయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మీ నియామకాలకు అగ్నిపథ్ అగ్గిపెట్టిందని, ఆగ్రహ జ్వాలలు దేశాన్ని కాల్చేస్తున్నాయని తెలిపారు. 

అయినప్పటికీ తగ్గేదేలేదంటూ నియామకాలు చేస్తామని, తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లంటూ మోదీ సర్కారు మొండిగా పోతోందని షర్మిల మండిపడ్డారు. అగ్నిపథ్ ను వెంటనే రద్దు చేసి గతంలో మాదిరిగా నియామకాలు చేపట్టాలని స్పష్టం చేశారు. పోలీసుల కాల్పుల్లో ఓ యువకుడు చనిపోయినందున, మరిన్ని అల్లర్లకు తావివ్వకుండా నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Sharmila
Agnipath Scheme
Army Recruitment

More Telugu News