Nani: 1 మిలియన్ డాలర్ల వసూళ్ల దిశగా 'అంటే .. సుందరానికీ!'

  • ఈ నెల 10వ తేదీన విడుదలైన 'అంటే .. సుందరానికీ'
  • కామెడీ పాళ్లు పెంచేసిన వివేక్ ఆత్రేయ 
  • అంతగా కనెక్ట్ కానీ పాటలు 
  • గ్లామర్ పరంగా ఆకట్టుకోలేకపోయిన నజ్రియా
Ante Sundaraniki movie update

నాని - నజ్రియా జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 'అంటే .. సుందరానికీ' సినిమా రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో లేకపోయినా, ఆ తరువాత పుంజుకున్నాయని అంటున్నారు. 

ఇక ఓవర్సీస్ లోను ఈ సినిమా వసూళ్లు నిలకడగానే ఉన్నాయని చెబుతున్నారు. ఇంతవరకూ ఈ సినిమా $800 K కంటే ఎక్కువ వసూలు చేసిందని అంటున్నారు. మరో రెండు మూడు రోజుల్లో ఈ సినిమా 1 మిలియన్ డాలర్ల మార్కును టచ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

ఈ సినిమాలో కామెడీ పాళ్లు ఎక్కువ .. రొమాన్స్ పాళ్లు కలపనేలేదు. నజ్రియా ఈ సినిమాకి ప్లస్ అవుతుందని టీమ్ అనుకుంది. కానీ ఆమెనే మైనస్ అనే టాక్ పబ్లిక్ లో నుంచి వచ్చింది. ఇక పాటలు కూడా అంతంత మాత్రంగానే అనిపించడం వలన ఆడియన్స్ కాస్త డీలాపడ్డారు. లేకపోతే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లేదే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  • Loading...

More Telugu News