Nani: 'దసరా' విషయంలో మనసు మార్చుకున్న నాని!

  • శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న 'దసరా'
  • ఊరమాస్ లుక్ తో కనిపించనున్న నాని 
  • ఆయన సరసన రెండోసారి నటిస్తున్న కీర్తి సురేశ్ 
  • క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలనే ఆలోచన  
Dasara movie upadate

నాని తాజా చిత్రంగా వచ్చిన 'అంటే .. సుందరానికీ' సినిమా ప్రస్తుతం థియేటర్లలో ఉంది. నిన్ననే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తరువాత ప్రాజెక్టుగా నాని 'దసరా' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన కొంత షూటింగు కూడా జరిగింది. 'నేను లోకల్' తరువాత నాని - కీర్తి సురేశ్ కలిసి నటిస్తున్న సినిమా ఇది.

సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో నాని పక్కా మాస్ లుక్ తో కనిపించనున్నాడు. ఇంత మాస్ లుక్ తో నాని చేయడం ఇదే ఫస్టు టైమ్. టైటిల్ కి తగినట్టుగా ఈ సినిమాను 'దసరా'కి రిలీజ్ చేయాలనుకున్నారు.

కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. అనుకున్నట్టుగా ఈ సినిమా షూటింగ్ స్పీడ్ అందుకోకపోవడం వలన ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. క్రితం ఏడాది క్రిస్మస్ మనదే అంటూ 'శ్యామ్ సింగ రాయ్'తో  నాని హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.

More Telugu News