‘అంటే.. సుందరానికీ’ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పై కేసు
- ఈ నెల 9న శిల్పకళా వేదికలో ప్రి రిలీజ్ ఈవెంట్
- ఎక్కడా కరోనా నిబంధనలు పాటించలేదని ఫిర్యాదు
- మైత్రీతో పాటు శ్రేయస్ మీడియాపై మాదాపూర్ పోలీసుల కేసు
ఈ నెల 9న హైదరాబాద్ లోని శిల్ప కళావేదికలో ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుకకు భారీగా అభిమానులు తరలివచ్చారు. అయితే, ఎక్కడా కరోనా నియమాలను పాటించలేదని మైత్రీ మూవీ మేకర్స్, కార్యక్రమ నిర్వహణ సంస్థ శ్రేయస్ మీడియాపై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ రెండు సంస్థలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.