Somu Veerraju: విధి నిర్వహణలో ఉన్న ఎస్సైని నెట్టారంటూ సోము వీర్రాజుపై కేసు నమోదు

Police case files on Somu Veerraju
షార్ట్స్‌లో చూడండి
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై పోలీసు కేసు నమోదైంది. ఇటీవల అమలాపురంలో అల్లర్లు జరగ్గా, సోము వీర్రాజు పరామర్శించేందుకు బయల్దేరారు. ఈ క్రమంలో సోము వీర్రాజును పోలీసులు జొన్నాడ వద్ద అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అమలాపురంలో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్-30 అమల్లో ఉన్నందున నిలిపివేశామని సోము వీర్రాజుకు పోలీసులు స్పష్టం చేశారు. 

ఈ నేపథ్యంలో, పోలీసు విధులకు ఆటంకం కలిగించారని, విధి నిర్వహణలో ఉన్న ఎస్సైని నెట్టివేశారని సోము వీర్రాజుపై అభియోగాలు మోపారు. ఈ మేరకు కోనసీమ జిల్లా ఆలమూరు పోలీస్ స్టేషన్ లో సెక్షన్ 353, సెక్షన్ 506 కింద కేసు నమోదు చేశారు.

అయితే, సోము వీర్రాజుతో పోలీసుల వాగ్వాదం ఓ ప్రణాళిక ప్రకారం జరిగిందని ఏపీ బీజేపీ ఆరోపించింది. జొన్నాడ జంక్షన్ లో పోలీసులు సోము వీర్రాజుతో వాగ్వాదానికి దిగగా, మరో పోలీసు దాన్ని వీడియోలో చిత్రీకరించడమే అందుకు నిదర్శనమని పేర్కొంది. ఈ మేరకు ఓ పోలీసు వీడియో తీస్తున్న ఫొటోను కూడా ఏపీ బీజేపీ పంచుకుంది.
.
Go Back to Shorts
Somu Veerraju
Police Case
Amalapuram
Konaseema District
BJP

More Telugu News