చిరంజీవి చాలా మంచి వ్యక్తి... ఆయన చేసే సేవలు కొన్ని మాత్రమే తెలుస్తున్నాయి: నటుడు బెనర్జీ
- 'చెప్పాలని ఉంది' కార్యక్రమానికి విచ్చేసిన బెనర్జీ
- చిరంజీవి బయోపిక్ నిర్మిస్తారన్న ప్రచారంపై వివరణ
- యూట్యూబ్ లో ఇష్టంవచ్చినట్టు రాస్తారని వెల్లడి
చిరంజీవి చేసే సేవా కార్యక్రమాలు కొన్ని మాత్రమే బయటికి తెలుస్తున్నాయని, చాలా సేవలు ఇంకా ఎవరికీ తెలియవని బెనర్జీ అభిప్రాయపడ్డారు. సినీ రంగంలోని 24 క్రాఫ్ట్స్ ల వారికే కాకుండా, బయటి వాళ్లకు కూడా కరోనా సంక్షోభం సమయంలో చేయూతగా నిలిచారని వెల్లడించారు. తనను ఎవరైనా దూషించినా చిరంజీవి పట్టించుకోరని, నటుడిగా ఆయన నుంచి ఎంతో నేర్చుకోవాలని పేర్కొన్నారు.