Sarkaru Vaari Paata: ఓటీటీలోకి వచ్చేసిన 'సర్కారువారి పాట'

Sarkaru Vaari Paata released in OTT in Amazon Prime
షార్ట్స్‌లో చూడండి
మహేశ్ బాబు, కీర్తీ సురేశ్ జంటగా నటించిన 'సర్కారువారి పాట' చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది. రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సత్తా చాటింది. ఈ చిత్రంలో సముద్రఖని, సుబ్బరాజు, వెన్నెల కిశోర్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్, 14 రీల్స్ ప్లస్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి. 

ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో విడుదలయింది. రూ. 199 చెల్లించి ఈ సినిమాను చూడాల్సి ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ చందాదారులు సైతం డబ్బులు చెల్లించి చూడాలి.
Go Back to Shorts
Sarkaru Vaari Paata
Mahesh Babu
Keerthy Suresh
OTT
Tollywood

More Telugu News