Sensex: కోలుకున్న మార్కెట్లు.. 437 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్

Markets ends in profits
షార్ట్స్‌లో చూడండి
వరుసగా రెండు రోజుల పాటు నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభపడ్డాయి. ఈరోజు ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు... ఆ తర్వాత కోలుకున్నాయి. రిలయన్స్, టీసీఎస్ వంటి బ్లూచిప్ కంపెనీల మద్దతుతో లాభాల్లోకి మళ్లాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 437 పాయింట్లు లాభపడి 55,818కి పెరిగింది. నిఫ్టీ 105 పాయింట్లు పెరిగి 16,628 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
రిలయన్స్ (3.51%), బజాజ్ ఫిన్ సర్వ్ (2.88%), సన్ ఫార్మా (2.35%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.08%), టీసీఎస్ (1.98%). 

టాప్ లూజర్స్:
హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.69%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.51%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.03%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.80%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-0.49%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News