కశ్మీరీ పండిట్లు ఆందోళన చేస్తుంటే... బీజేపీ సంబరాల్లో మునిగింది: రాహుల్ గాంధీ ఆరోపణ
- గడచిన ఐదు రోజుల్లో కశ్మీర్‌లో 18 మంది పౌరుల మృతి
- కుల్గామ్‌లో పాఠశాల ఉపాధ్యాయురాలిని చంపిన దుండగులు
- ఈ ఘటనను కోట్ చేస్తూ ప్రధాని మోదీపై రాహుల్ ధ్వజం
- ఇది సినిమా కాదు, నేటి కశ్మీర్ వాస్తవికత అంటూ దెప్పిపొడుపు
గడచిన ఐదు రోజుల్లోనే కశ్మీర్‌లో 15 మంది సైనికులు, 18 మంది సాధారణ పౌరులు మృతి చెందారు. కుల్గామ్‌లో ఓ పాఠశాల ఉపాధ్యాయురాలిని దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటనలను గుర్తు చేస్తూ బుధవారం రాహుల్ గాంధీ కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు కశ్మీర్ పండిట్లు భద్రత లేక ఆందోళనలు చేస్తుంటే...బీజేపీ ప్రభుత్వం మోదీ పాలనా సంబరాల్లో మునిగిపోయిందని ఆయన ధ్వజమెత్తారు.