వైజాగ్ లో 'అంటే .. సుందరానికీ' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్!
- పూర్తి వినోదభరిత చిత్రంగా 'అంటే సుందరానికీ'
- సుందరం పాత్రలో అల్లరి చేయనున్న నాని
- లీలా థామస్ పాత్రలో సందడి చేయనున్న నజ్రియా
- జూన్ 10వ తేదీన సినిమా విడుదల
ఈ సినిమాతో కథానాయికగా నజ్రియా పరిచయమవుతోంది. సుందరం పాత్రలో నాని నటించగా, లీలా థామస్ పాత్రలో నజ్రియా అలరించనుంది. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన అప్ డేట్స్ జనంలోకి బాగా వెళ్లాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ డేట్ ను ప్రకటిస్తూ, అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు.
ఈ నెల 2వ తేదీన వైజాగ్ - ఆంధ్ర యూనివర్సిటీలోని సీఆర్ కాన్వోకేషన్ హాల్ లో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. ఆ రోజున సాయంత్రం 5 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమమవుతుంది. నరేశ్ .. నదియా .. రోహిణి ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను, జూన్ 10వ తేదీన విడుదల చేయనున్నారు.