Prime Minister: కాన్వాయ్ ఆపి.. బాలిక గీసిన త‌న త‌ల్లి పెయింటింగును తీసుకున్న మోదీ... వీడియో ఇదిగో

pm modi stopped his car to accept the painting from a girl in Shimla
షార్ట్స్‌లో చూడండి
ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ మంగ‌ళ‌వారం నాటి హిమాచ‌ల్ ప్ర‌దేశ్ పర్య‌ట‌న‌లో భాగంగా ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాజ‌ధాని సిమ్లాలో రోడ్డుకు ఇరువైపులా నిల‌బ‌డ్డ జ‌నానికి అభివాదం చేస్తూ స్పీడుగా సాగుతున్న మోదీ... ఓ చోట ఉన్న‌ట్టుండి త‌న కాన్వాయ్‌ను ఆపారు. ఆ త‌ర్వాత కారులో నుంచి దిగిన మోదీ.. ఆ జ‌న స‌మూహంలో బారీకేడ్ల‌కు ఆవ‌ల నిలుచున్న ఓ బాలిక వ‌ద్ద‌కు వెళ్లారు. 

ఆ బాలిక చేతిలోని పెయింటింగ్‌ను తీసుకున్నారు. బారీకేడ్ల‌కు ఆవ‌లే నిలుచుండి మ‌రీ మోదీ కాళ్ల‌కు ఆ బాలిక న‌మ‌స్క‌రిస్తే... మోదీ ఆ బాలిక‌ను ఆశీర్వ‌దించారు. ఇంత‌కీ ఆ బాలిక గీసిన పెయింటింగ్ ఎవ‌రిదో తెలుసా? మోదీ మాతృమూర్తిది. కాన్వాయ్‌లో స్పీడుగా వెళుతున్న మోదీ... త‌న త‌ల్లి పెయింటింగ్ చూడ‌గానే త‌న కాన్వాయ్‌ని నిలిపేయ‌డం గ‌మ‌నార్హం.
Go Back to Shorts
Prime Minister
Narendra Modi
Himachal Pradesh
Shimla
Painting

More Telugu News