కొండాపూర్ లో యువతిపై నలుగురు యువకులతో దాడి చేయించిన వివాహిత

Woman was brutally attacked by four men in Hyderabad
  • కొండాపూర్ లో ఉంటున్న శ్రీకాంత్, గాయత్రి 
  • శ్రీకాంత్ కు మరో యువతితో స్నేహం
  • భర్తను వలలో వేసుకుందని ఆ యువతిపై గాయత్రి అనుమానం
  • నమ్మకంగా ఇంటికి పిలిచి బంధించిన వైనం
హైదరాబాదులోని కొండాపూర్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతిపై గాయత్రి అనే వివాహిత నలుగురు యువకులతో దాడి చేయించింది. గాయత్రి, శ్రీకాంత్ దంపతులు కాగా... శ్రీకాంత్ కు, బాధిత యువతికి మధ్య కొన్నాళ్లుగా స్నేహం నెలకొంది. 

అయితే, గాయత్రి సదరు యువతిపై అనుమానం పెంచుకుంది. తన భర్తతో సంబంధం ఉందని భావించి, ఈ నెల 26న ఆ యువతిని నమ్మకంగా ఇంటికి పిలిచింది. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం ఆ యువతిని ఓ గదిలో బంధించింది. ఆపై, నలుగురు యువకులతో ఆ యువతిపై దాడి చేయించింది. ఆ యువకులు బాధిత యువతి నోటికి ప్లాస్టర్ వేసి తీవ్రంగా హింసించారు. ఈ తతంగాన్ని గాయత్రి తన మొబైల్ ఫోన్ లో వీడియోగా చిత్రీకరించింది. తన భర్త జోలికి వస్తే వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెడతానని ఆ యువతిని బెదిరించింది. 

కాగా, గాయాలపాలైన ఆ యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, జరిగిన ఘాతుకంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాయత్రిని, ఆమెకు సహకరించిన నలుగురు యువకులను అరెస్ట్ చేశారు.
Go Back to Shorts
Woman
Attack
Married Woman
Kondapur
Hyderabad

More Telugu News