కుమారుడి మరణాన్ని తట్టుకోలేక దంపతుల ఆత్మహత్య
- ఎన్టీఆర్ జిల్లా చిన నందిగామలో ఘటన
- ట్రాక్టర్ ప్రమాదంలో మరణించిన కుమారుడు జగదీశ్
- అతడు లేడన్న వేదనతో ఉరేసుకున్న సాంబశివరావు, విజయలక్ష్మి
ఈ ఘటన వివరాల్లోకెళితే... చిన నందిగామకు చెందిన దంపతులు సాంబశివరావు, విజయలక్ష్మి దంపతులకు జగదీశ్ అనే కుమారుడు ఉన్నాడు. ఇటీవలే ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో జగదీశ్ మరణించాడు. అప్పటి నుంచి తీవ్ర ఆవేదనలో కూరుకుపోయిన సాంబశివరావు, విజయలక్ష్మి కుమారుడు లేనిదే బతకలేనంతగా మారిపోయారు. ఈ క్రమంలోనే వారిద్దరూ ఆదివారం వారి ఇంటిలోనే ఉరేసుకుని చనిపోయారు.