నోరు అదుపులో పెట్టుకోండి!... కేటీఆర్‌కు డీకే అరుణ వార్నింగ్‌!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నోరు అదుపులో పెట్టుకోండి!... కేటీఆర్‌కు డీకే అరుణ వార్నింగ్‌!

dk aruna strong warning to ktr
  • అమిత్ షా తెలంగాణ టూర్‌పై కేటీఆర్ సెటైర్లు
  • ఘాటుగా ప్ర‌తిస్పందించిన డీకే అరుణ‌
  • కేటీఆర్‌ తండ్రి పాస్‌పోర్టు బ్రోక‌ర్ అన్న బీజేపీ నేత‌
టీఆర్ఎస్  వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు హెచ్చ‌రికలు జారీ చేస్తూ బీజేపీ జాతీయ ఉపాధ్య‌క్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మీద‌, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మీద కామెంట్లు చేస్తున్నారంటూ కేటీఆర్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన అరుణ‌.... నోరు అదుపులో పెట్టుకోవాల‌ని సూచించారు. ఈ మేరకు సోమ‌వారం సాయంత్రం ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆమె ఓ పోస్ట్ పెట్టారు. 

అస‌లు మీ అయ్యా కొడుకుల స్థాయి ఏమిటి?  మీ బ‌తుకు ఏమిటి? అంటూ కీల‌క వ్యాఖ్య‌లు చేసిన డీకే అరుణ‌... మీ తండ్రి ఓ పాస్‌పోర్టు బ్రోక‌ర్ అనే సంగ‌తి మ‌రిచారా? అంటూ కేటీఆర్‌పై విరుచుకుప‌డ్డారు. ఇప్ప‌టికైనా నోటిని అదుపులో పెట్టుకోవాల‌ని ఆమె కేటీఆర్‌కు సూచించారు. రెండు రోజుల క్రితం అమిత్ షా తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు రాగా... ఆయ‌న‌ ప‌ర్య‌ట‌న‌పై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాల‌తో విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే.
DK Aruna
BJP
KTR
TRS
Amit Shah

More Telugu News