అమిత్ షా గారి మాటలకు ఊదు కాలదు.. పీరు లేవదు: ష‌ర్మిల‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమిత్ షా గారి మాటలకు ఊదు కాలదు.. పీరు లేవదు: ష‌ర్మిల‌

sharmila slams amit shah
  • అవినీతి చేస్తున్నారని తెలిసికూడా కేసీఆర్‌ ను అరెస్ట్ చెయ్యట్లేద‌న్న ష‌ర్మిల‌ 
  • కేంద్రంలో అధికారంలో ఉండికూడా తెలంగాణ బాయిల్డ్ రైస్ కొనడం లేద‌ని వ్యాఖ్య‌
  • తెలంగాణలో అధికారంలోకి వస్తే కొంటారా? అంటూ ఎద్దేవా
కేంద్ర మంత్రి అమిత్ షాపై వైఎస్సార్‌టీపీ అధినేత్రి ష‌ర్మిల తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్రతి ఏడాది దేశంలో రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ 2014 ఎన్నిక‌ల ముందు ఇచ్చిన‌ హామీని నెరవేర్చలేదని, ఇప్పుడు తెలంగాణ‌లో ఉద్యోగాలు ఇస్తామ‌ని మ‌రోసారి మ‌భ్య‌పెడుతున్నార‌ని చెప్పారు. 

''అమిత్ షా గారి మాటలకు ఊదు కాలదు. పీరు లేవదు. అవినీతి చేస్తున్నారని తెలిసికూడా మీ పాతమిత్రుడు కేసీఆర్‌ని అరెస్ట్ చెయ్యరు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతి పథకంలో వాటా ఉందన్న మీరు.. కేసీఆర్ అవినీతిలో మీకు వాటాలెదంటే నమ్మాలా? 8 ఏండ్లుగా ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఏమైనా ఇచ్చారా? ఇక తెలంగాణలో ఇస్తారా?  

కేంద్రంలో అధికారంలో ఉండికూడా తెలంగాణ బాయిల్డ్ రైస్ కొనని మీరు, తెలంగాణలో అధికారంలోకి వస్తే కొంటారా? రైతులను కార్లతో గుద్దిచంపిన మీరు మా రైతాంగాన్ని ఆదుకుంటామని చెవిలో పూలు పెడుతున్నారా? చట్టబద్ధంగా ఇచ్చిన విభజన హామీలకే దిక్కులేదు ఇక ఏం మొహం పెట్టుకొని ఒక్క చాన్స్ ఆడుగుతున్నారు? 

నిలబెట్ట చేతకాదు గానీ కూలగొట్టడంలో దిట్టలు మీరు. మైనార్టీలను బలి పశువులను చేసి అధికార పీఠాలను ఎక్కుతున్న మీరు వాళ్లకున్న 4 శాతం రిజర్వేషన్ తీసెయ్యడం కాక ఇంకేం ఆలోచించగలరు?  వైఎస్సార్‌ గారు ఇచ్చిన రిజర్వేషన్ మోదీ, షా కలిసొచ్చినా పీకెయ్యలేరు. మీ మతోన్మాదాన్ని ఎదిరించగలగేది వైఎస్సార్‌ స్ఫూర్తి మాత్రమే'' అని ష‌ర్మిల అన్నారు. 

YS Sharmila
YSRTP
Amit Shah

More Telugu News