BJP: హైద‌రాబాద్ చేరుకున్న అమిత్ షా!.. టూర్ షెడ్యూల్ ఇలా!

amit shah reached hyderabad
షార్ట్స్‌లో చూడండి
బీజేపీ అగ్ర‌నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాసేప‌టి క్రితం హైద‌రాబాద్ చేరుకున్నారు. నేటి మ‌ధ్యాహ్నం ఢిల్లీలో బ‌య‌లుదేరిన ఆయ‌న కాసేప‌టి క్రితం న‌గ‌రంలోని బేగంపేట విమానాశ్ర‌యంలో ల్యాండ‌య్యారు. ఈ సంద‌ర్భంగా అమిత్ షాకు బీజేపీ తెలంగాణ శాఖ‌కు చెందిన నేత‌లు సాద‌రంగా స్వాగ‌తం ప‌లికారు.

మ‌రికాసేప‌ట్లో ఆయన సీఎఫ్ఎస్ఎల్ క్యాంపస్‌కు చేరుకుంటారు. అక్క‌డ‌ కొత్త‌గా ఏర్పాటు చేసిన‌ నేష‌న‌ల్ సైబ‌ర్ ఫోరెన్సిక్ ల్యాబోరేట‌రీని ఆయ‌న ప్రారంభించ‌నున్నారు. ఆ త‌ర్వాత తెలంగాణ బీజేపీ కోర్ క‌మిటీ నేత‌ల‌తో అమిత్ షా భేటీ కానున్నారు. ఈ భేటీ తర్వాత తుక్కుగూడ‌లో జ‌ర‌గ‌నున్న బండి సంజ‌య్ పాద‌యాత్ర ముగింపు కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వుతారు. ఆ కార్య‌క్ర‌మం తర్వాత అమిత్ షా ఢిల్లీకి తిరుగు ప‌య‌న‌మ‌వుతారు.
Go Back to Shorts
BJP
Telangana
Amit Shah
Begumpet

More Telugu News