భాగ్యనగరిలో మరో ఐటీ సంస్థ.. కేటీఆర్‌తో గ్రిడ్ డైనమిక్స్ సీఈఓ భేటీ
- డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ రంగంలో దిగ్గజ కంపెనీగా గ్రిడ్ డైనమిక్స్
- అమెరికా, యూరప్‌లలో సంస్థ కార్యకలాపాలు
- భారత్‌లో తన తొలి కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటుకు సంసిద్ధత
ఈ మేరకు సోమవారం గ్రిడ్ డైనమిక్స్ సీఈఓ లియోనార్డ్ లివ్‌సిజ్ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. భారత్‌లోనే తన తొలి కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా లియోనార్డ్ తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి 1,000 మంది ఉద్యోగులతో కూడిన కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.