ఏపీ సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి.. ఐఏఎస్ లను బదిలీ చేసిన ప్రభుత్వం
- టీటీడీ ఈవో విధుల నుంచి రిలీవ్
- కొత్త ఈవోగా ఏఈవో ధర్మారెడ్డికి ప్రమోషన్
- మైనారిటీ శాఖ కార్యదర్శిగా ఇంతియాజ్ కు అదనపు బాధ్యతలు
స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా సత్యనారాయణకు స్థాన చలనం కల్పించింది. ప్రస్తుతం యువజన సర్వీసుల శాఖ కమిషనర్ గా ఉన్న నాగరాణిని రిలీవ్ చేసి.. ఆ స్థానంలో శారదా దేవిని నియమించింది. సెర్ప్ సీఈవో ఇంతియాజ్ ను మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా నియమిస్తూ అదనపు బాధ్యతలను అప్పగించింది.