సిటీ బస్సులో సజ్జనార్.. టీఎస్ఆర్టీసీలో కొత్త కార్యక్రమానికి శ్రీకారం
- థర్స్‌డే- బస్ డే పేరిట కొత్త కార్యక్రమం
- ప్రయాణికుల అభిప్రాయ సేకరణే లక్ష్యం
- సిటీ బస్సులో స్వయంగా ప్రయాణికులతో మాట్లాడిన సజ్జనార్
కొత్తగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం నాడు ఆయన హైదరాబాద్‌లోని సిటీ బస్సుల్లో ప్రయాణించారు. ఆయా బస్సుల్లో ప్రయాణిస్తున్న వారితో మాట్లాడారు. ఆర్టీసీ సేవలపై వారి అభిప్రాయాలను, ఫిర్యాదులను కూడా తెలుసుకునే యత్నం చేశారు. ప్రయాణికులతో పాటు ఆయా బస్సుల్లో విధుల్లో ఉన్న ఆర్టీసీ సిబ్బందితోనూ సజ్జనార్ ముచ్చటించారు.