రేపు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు
- ఆముదాలవలస నియోజకవర్గం దల్లవలస గ్రామంలో పర్యటించనున్న చంద్రబాబు
- ఇంటింటికీ తిరిగి ప్రజా సమస్యలను తెలుసుకోనున్న బాబు
- రాత్రికి ప్రజలతో కలిసి సహపంక్తి భోజనాలు
ఈ సందర్భంగా విద్యుత్, ఆర్టీసీ ఛార్జీల పెంపు, నిత్యావసర ధరల పెరుగుదల వంటివాటిని ప్రజలకు వివరించనున్నారు. అనంతరం గ్రామంలోని దళిత, బడుగు, బలహీనవర్గాల ప్రజలతో కలిసి సహపంక్తి భోజనాలు చేయనున్నారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించి టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ ఏర్పాట్లు చేస్తున్నారు.