Suma: 'జయమ్మ పంచాయితీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నాగ్ .. నాని!

  • 'జయమ్మ' పాత్రను పోషించిన సుమ 
  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది 
  • రేపు జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సన్నాహాలు 
  • మే 6వ తేదీన సినిమాను విడుదల చేయనున్నారు
Jayamma Panchayithi Pre Release Event Date Confirmed

యాంకర్ గా .. హోస్ట్ గా సుమకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. చాలా కాలం క్రితమే హీరోయిన్ గా ఒక సినిమా చేసిన సుమ, ఆ తరువాత నుంచి సినిమాల వైపు వెళ్లలేదు. మళ్లీ ఇప్పుడు .. ఇంతకాలానికి ఆమె ఒక సినిమా వైపు మొగ్గు చూపింది. ఆమె టైటిల్ రోల్ ను పోషించిన 'జయమ్మ పంచాయితీ' విడుదలకు ముస్తాబైంది.

వెన్నెల క్రియేషన్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి విజయ్ కలివరపు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందించడం విశేషం. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వచ్చిన పాటలకు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. మే 6వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 30వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ .. దసపల్లా హోటల్లో నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఈ సినిమాకి ముఖ్య అతిథులుగా నాగార్జున .. నాని వస్తున్నట్టుగా చెబుతూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు.

More Telugu News