రాళ్ల దాడిలో ఎస్సై త‌ల‌కు తీవ్ర గాయం... మ‌రో కానిస్టేబుల్‌కూ గాయాలు

si and a constable injured in ysrcp stone pelting
  • స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ త‌ల‌పై ప‌డ్డ పెద్ద రాయి
  • ఫ‌లితంగా ఎస్సై త‌ల‌కు తీవ్ర గాయం
  • దాడిలో మ‌రో కానిస్టేబుల్‌కూ గాయాలైన వైనం
హ‌త్యకు గురైన బాధితురాలి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు గురువారం గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మ‌పూడి గ్రామానికి వెళ్లిన టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్‌పై వైసీపీ శ్రేణులు రాళ్ల దాడికి దిగిన సంగ‌తి తెలిసిందే.  

ఈ ఘ‌ట‌న‌లో నారా లోకేశ్ నిలుచున్న చోటుకు అతి స‌మీపంలో ఓ పెద్ద రాయి వ‌చ్చి ప‌డింది. అయితే ఈ ఘ‌ట‌న‌లో లోకేశ్‌కు ఏమీ కాకున్నా... రాళ్ల దాడిని నిలువ‌రించేందుకు య‌త్నించిన పోలీసుల‌కు మాత్రం గాయాల‌య్యాయి. వైసీపీ శ్రేణులు విరిసిన ఓ పెద్ద రాయి విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న ఓ ఎస్సై త‌ల‌పై ప‌డింది. దీంతో ఆయ‌న త‌ల‌కు తీవ్ర గాయం అయ్యింది. మ‌రోవైపు ఈ దాడిలో మ‌రో కానిస్టేబుల్‌కు కూడా గాయాల‌య్యాయి.
Go Back to Shorts
TDP
Nara Lokesh
YSRCP
Duggirala

More Telugu News