Rajanikanth: మళ్లీ తెరపైకి రజనీకాంత్.. రమ్యకృష్ణ కాంబినేషన్!

Ramyakrishna in Nelson Dileep Kumar Movie
షార్ట్స్‌లో చూడండి
రజనీకాంత్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో 'పడయప్పా' ఒకటిగా కనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకుల ముందుకు 'నరసింహా'గా వచ్చిన ఈ సినిమా ఇక్కడ భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో 'నీలాంబరి'గా రమ్యకృష్ణ నటనను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. 

ఈ సినిమాతో రమ్యకృష్ణ  క్రేజ్ .. ఆమె గ్రాఫ్ ఎక్కడికో వెళ్లిపోయాయి. ఆమెకి మంచిపేరు తెచ్చిపెట్టిన పాత్రల్లో ఇది ముందువరుసలో కనిపిస్తుంది. ఈ సినిమాలో నువ్వా? నేనా? అన్నట్టుగా ఆమె రజనీతో పోటీపడి నటించింది. అలాంటి ఒక పాత్రలోనే .. అదీ రజనీ సినిమాలోనే ఆమెను త్వరలో ప్రేక్షకులు చూడనున్నట్టు తెలుస్తోంది.

రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమాలో  పవర్ఫుల్ లేడీ విలన్ పాత్ర కోసం రమ్యకృష్ణను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. చాలా కాలం తరువాత ఈ కాంబినేషన్ తెరపైకి వస్తుండటం విశేషం.
Go Back to Shorts
Rajanikanth
Ramyakrishna
Nelson Movie

More Telugu News