త్వరలోనే తెలుగు సినిమా చేస్తాను: 'కేజీఎఫ్' బ్యూటీ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

త్వరలోనే తెలుగు సినిమా చేస్తాను: 'కేజీఎఫ్' బ్యూటీ!

KGF 2 Movie Update
  • 'కేజీఎఫ్'లో ఛాన్స్ రావడం అదృష్టమన్న శ్రీనిధి 
  • తన పాత్రకి మంచి పేరు వచ్చిందని ఆనందం   
  • తమిళంలో 'కోబ్రా' రిలీజ్ కి ఉందని వెల్లడి  
  • తెలుగు బాగా నేర్చుకుంటున్నానన్న శ్రీనిధి శెట్టి 
' కేజీఎఫ్' .. 'కేజీఎఫ్ 2' సినిమాలు చూసినవారు శ్రీనిధి శెట్టిని అంత తొందరగా మరిచిపోలేరు. మంచి హైటూ .. అందుకు తగిన ఆకర్షణీయమైన రూపంతో ఆమె ఇట్టే ఆకట్టుకుంటుంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. ' కేజీఎఫ్ 2' సినిమా నా క్రేజ్ ను మరింతగా పెంచింది. ఈ సినిమా చూసినవాళ్లంతా  చాలా బాగా చేశావని అంటున్నారు.  

నేను .. నా ఫ్యామిలీ మెంబర్స్ ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతో వెయిట్ చేశాము. ఇప్పుడు ఈ సినిమా వందల కోట్లను వసూలు చేస్తుండటం చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తోంది. ప్రశాంత్ నీల్ గారికి ప్రతి అంశంపై క్లారిటీ ఉంటుంది. ప్రతి రోజూ షూటింగ్ ఒక ప్లానింగ్ ప్రకారమే నడిచేది. నిర్మాతలు కూడా ఖర్చుకు వెనుకాడలేదు.

ఇంత పెద్ద సినిమాలో నాకు ఛాన్స్ వచ్చినందుకు  .. అది ఇంత పెద్ద హిట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం తెలుగును మరింత స్పష్టంగా మాట్లాడం నేర్చుకుంటున్నాను. తమిళంలో 'కోబ్రా' సినిమా విడుదలైన తరువాత తెలుగు సినిమాపై దృష్టి పెడతాను. తప్పకుండా తెలుగు సినిమాలు చేస్తాను" అని చెప్పుకొచ్చింది.
yash
Prashnth Neel
KGF 2 Movie

More Telugu News